తప్పతాగి రోడ్ మీద కార్ నడిపి పోలీసులకు చిక్కాడు అంటూ రచయిత బి.వి.ఎస్ రవి పై వచ్చిన పుకార్లను ఆయన కొట్టిపారేశాడు. ఇది హైదరాబాద్ లో చాలా మమోలుగా జరిగే పోలీస్ చెక్ అప్ అని చెప్పుకొచ్చాడు. పోలీసులు కారు ఆపే సమయంలో బి.వి.ఎస్ రవితో పాటు రవితేజ కూడా వున్నారు
నేను ఎటువంటి అరెస్ట్ కి గురికాలేదు. నిక్షేపంగా ఇంట్లోనే వున్నాను. అదంతా మీడియా వాళ్ళ తప్పుడు సమాచారం అని ట్విట్టర్ లో తెలిపాడు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమా తరువాత ఈ రచయితకు అవకాశాలు దండుగా వస్తున్నాయి. ఈయన గోపీ మోహన్, కోన వెంకట్ లతో కలిసి పనిచేస్తున్నారు
ఈ ఏడాది మొదట్లో బి.వి.ఎస్ రవి ‘సెకండ్ హ్యాండ్’ అనే సినిమాకు సహ నిర్మాణం వహించారు