‘ఓజి’ రిలీజ్ తర్వాతే ఉస్తాద్ ప్రమోషన్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. పవన్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్నాయి, ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. ఐతే, ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్ డేట్ విషయానికి వస్తే, షూటింగ్ ఇంకా హైదరాబాద్‌లో జరుగుతోంది. కానీ, ఎలాంటి అధికారికంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. కారణం.. పవన్ ‘ఓజి’ విడుదలయ్యే వరకు నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించారట.

ఐతే, మొదటి సింగిల్ 2025 అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల మరియు రాశి ఖన్నా నటించారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ షూట్ లో పవన్ కొన్ని రోజులు పాల్గొననుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Exit mobile version