‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేది అప్పుడే..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేయగా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య నటనకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డేట్‌పై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘డాకు మహారాజ్’ చిత్ర ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి.

Exit mobile version