‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు ఆ డేట్ పర్ఫెక్ట్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను జూన్ నెలాఖరన రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ, మంచు విష్ణు నటించిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కన్నప్ప’ ఈ నెలాఖరున రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో ఆ సినిమాకు ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశ్యంతో వీరమల్లు మూవీని వచ్చే నెలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కానీ, జూలై 4న ‘తమ్ముడు’, జూలై 11న అనుష్క ‘ఘాటి’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

దీంతో జూలై 18న వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ డేట్ అయితే వీరమల్లు మూవీకి బెస్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. పోటీ కూడా ఏమీ లేకపోవడం.. సినిమా ప్రమోషన్స్‌కు కావాల్సినంత సమయం ఉండటంతో ఈ డేట్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌లో ఈ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version