గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ ఊరమాస్ లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా, సినీ సర్కిల్స్‌లో చరణ్ నెక్స్ట్ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
చరణ్ నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో సుకుమార్-చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో చరణ్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అయితే, ఇప్పుడు చరణ్ కోసం సుకుమార్ రంగస్థలం చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ కథను రాసి చరణ్‌కు వినిపించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నాడట. ఇదే గనక నిజం అయితే, సుకుమార్‌తో చరణ్ మరోసారి బాక్సాఫీస్ లెక్కలు తిరగరాయడం ఖాయం. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.