‘ఓజీ’లో నేతాజీ బ్యాక్‌డ్రాప్.. నిజమేనా..?

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు అప్పుడే రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో పవన్ తనయుడు అకీరా ఎంట్రీ ఇస్తాడనే ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేపథ్యం ఉండనుందనే వార్త వినిపిస్తోంది. ఓజీ థీమ్‌తో సుజీత్ ‘వన్స్ మోర్’ అనే ఆన్‌లైన్ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చాడు. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేపథ్యం ఉండటమే ఈ వార్తకు కారణంగా మారింది.

మరి నిజంగానే ఓజీ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా కథ ఉండబోతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version