ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న రెట్రో..?

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న రెట్రో..?

Published on May 16, 2025 3:38 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు అనే టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ఓటీటీలో ఆడియెన్స్‌ను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు