NKR21 కోర్ పాయింట్ ఇదేనా?

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NKR21 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను రేపు(మార్చి 8) అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా ఈ సినిమా కోర్ పాయింట్ ఏమిటనే విషయంపై మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చెబుతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయశాంతి ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుందని.. ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని తెలుస్తోంది.

తన తల్లికి ఎదురయ్యే సమస్యలను కొడుకుగా కళ్యాణ్ రామ్ ఎలాంటి పరిష్కారం అందించనున్నాడనేది ఈ సినిమా కథగా ఉంటుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ ఇదేనా..? అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోహేల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version