యష్ భారీ చిత్రం కోసం అనిరుద్?

యష్ భారీ చిత్రం కోసం అనిరుద్?

Published on Jul 6, 2025 11:01 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీయఫ్ చిత్రాలు ఇచ్చిన సక్సెస్ తర్వాత తన లైనప్ నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా ప్యాకెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే యష్ నుంచి రీసెంట్ గానే వచ్చిన ‘రామాయణ’ అనౌన్సమెంట్ తో మరిన్ని అంచనాలు నెలకొనగా తాను హీరోగా చేస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా కోసం సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ వర్క్ చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

అయితే పాటలు కోసం కాదు కానీ మేకర్స్ ఈ సినిమాలో అనిరుద్ ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు తీసుకున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవెల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాకి అనిరుద్ స్కోర్ అంటే మేజర్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు