ఓటిటి సమీక్ష: ప్రియాంక చోప్రా ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ – తెలుగు డబ్ చిత్రం ప్రైమ్ వీడియోలో

ఓటిటి సమీక్ష: ప్రియాంక చోప్రా ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ – తెలుగు డబ్ చిత్రం ప్రైమ్ వీడియోలో

Published on Jul 6, 2025 8:55 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 02, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : జాన్ సీనా, ఐడ్రిస్ ఎల్బా, ప్రియాంక చోప్రా జోన్స్, జాక్ క్వాయిడ్, ప్యాడీ కాంసిడిన్, కార్లా గుగినో, సారా నైల్స్ తదితరులు
దర్శకత్వం : ఇలియా విక్టోరోవిచ్ నైషుల్లర్
నిర్మాతలు : పీటర్ సఫ్రాన్, జాన్ రికర్డ్
సినిమాటోగ్రఫీ : బెన్ డేవిస్
సంగీతం : స్టీవెన్ ప్రైస్
ఎడిటర్ : టామ్ హారిసన్ – రీడ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ కూడా ఒకటి. ప్రముఖ స్టార్స్ ప్రియాంక చోప్రా జోన్స్, జాన్ సీనా ఇంకా ఐడ్రిస్ ఎల్బా లాంటి నటులు నటించిన చిత్రం కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

సినిమాల్లో అప్పటికీ బాగా రాణించిన నటుడు విల్ డెరింగర్ (జాన్ సీనా) అమెరికా ప్రెసిడెంట్ కాగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా సామ్ క్లార్క్ (ఐడ్రిస్ ఎల్బా) లు తమ దేశాలని ప్రజలకి సేవ చేస్తూ నడిపిస్తూ ఉంటారు. అయితే ఇద్దరికీ ముందు నుంచి అంత సఖ్యత ఉండదు. ఇంకోపక్క నోయెల్ బిస్సేట్ (ప్రియాంక చోప్రా) బ్రిటిష్ ఎం ఐ ఏ లో ఏజెంట్ గా పని చేస్తుంది. అయితే ఇరు దేశాల పెద్ద తలలకి విక్టర్ గ్రేడోవ్ (పాడీ కన్సడైన్) ఆయుధాల వ్యాపారి అమెరికన్ అధునాతన సెక్యూరిటీ ఎషెలాన్ సెక్యూరిటీని హ్యాక్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకొని వారి ప్రాణాలు తీయాలనే ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో డెరింగర్, సామ్ లు కలిసి వర్క్ చేస్తారా లేదా? వీరి దేశాలతో పాటు తమతో పొత్తులో ఉన్న నాటో అలయన్స్ లో ఉన్న ఇతర దేశాలు ఏం చేసాయి? అసలు వీరిని చంపి అన్ని దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేది ఎవరు? గ్రేడోవ్ కి ఉన్న పగ ఏంటి? ఇందులో ప్రియాంక చోప్రా పాత్ర ఏం చేసింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

పెద్దగా కథతో సంబంధం లేకుండా మంచిగా ఎంజాయ్ చేసే సాలిడ్ యాక్షన్ డ్రామా అందులోని మంచి ఫన్ తో కూడుకున్న లాంటి వాటిని చూడాలి అనుకునేవారికి ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. లీడ్ నటీనటులు నుంచి యాక్షన్ బ్లాక్స్ వరకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ని ఈ చిత్రం అందిస్తుంది.

ముఖ్యంగా జాన్ సీనా, ఐడ్రిస్ ల నడుమ సన్నివేశాలు మంచి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. వారిపై యాక్షన్ సీక్వెన్స్ లు కానీ సిచువేషనల్ కామెడీ సీన్స్ గాని సినిమాలో ఎంగేజ్ చేస్తాయి. రెండు దేశాలకి రిప్రెజెంటేటర్స్ గా ఇద్దరూ కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తారు. హుందాతనం పక్కన పెడితే వీరిలోని యాక్షన్ మూమెంట్స్ కామెడీ టైమింగ్ లతో ఆకట్టుకుంటారు.

ఇంకా ప్రియాంక చోప్రా అయితే మరో హైలైట్ అని చెప్పాలి. తాను కూడా సాలిడ్ రోల్ ని దక్కించుకుంది. నాన్ స్టాప్ యాక్షన్ తో అదరగొట్టేసింది. తన ఫ్యాన్స్ అయితే ట్రీట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా సినిమాలో మంచి ట్విస్ట్ లు టర్నింగ్ లు కూడా సర్ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటుగా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. మంచి స్టైలిష్ అండ్ కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకునేవారు దీనిని డెఫినెట్ గా ట్రై చేయొచ్చు.

ఇంకా ది బాయ్స్ సిరీస్ ఫేమ్ హ్యూయీ (జాక్ క్వాయిడ్) కనిపించిన కొంచెం సేపు కూడా అదరగొట్టేసాడు. తనపై యాక్షన్ ఎపిసోడ్ కూడా మంచి కేజ్రీగా అనిపిస్తుంది. అలాగే ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. ఇంకా విలన్ ఎందుకు రెండు దేశాల పెద్ద తలలుని చంపాలి అనుకుంటాడు అనే దానికి మంచి రివెంజ్ పాయింట్ ని పెట్టుకున్నారు. ఇది అర్ధవంతంగా ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ముందు చెప్పినట్టే ఇందులో అంత క్లిష్టమైన కథ లేదు. విలన్ రివెంజ్ పాయింట్ వరకు ఓకే కానీ ఇందులో పొలిటికల్ గా కనిపించిన అంశాలు మాత్రం ఏమంత గొప్పగా ఉండవు. ఇవి రొటీన్ రెగ్యులర్ పొలిటికల్ బ్యాక్ స్టాబ్ డ్రామా లానే కనిపిస్తాయి.

అలాగే స్టార్టింగ్ లో కొన్ని నిమిషాలు వరకు కథనం అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి అనిపించదు. నెమ్మదిగా అంశాలు పికప్ అవుతాయి. అలాగే ప్రియాంక చోప్రా రోల్ కి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సింది.

ఎక్కడో స్టార్టింగ్ లో కనిపించాక మళ్ళీ గంట వరకు తన ప్రెజెన్స్ మిస్ అవుతుంది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ బ్యాంగ్ ని ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది. అలాగే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మాత్రం నాచురల్ గా కనిపించలేదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకోవాల్సింది. ఇవి మినహా మిగతా టీం వర్క్ అంతా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ అలాగే ఎడిటింగ్ వంటివి బాగున్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఇలియా విక్టోరోవిచ్ నైషుల్లర్ విషయానికి వస్తే.. తన కథ ఎంపిక సింపుల్ గానే ఉంది కానీ మిగతా అంశాలని మాత్రం ఎంగేజింగ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. మంచి ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక మ్యాడ్ రైడ్ లాంటి దాన్ని ఆవిష్కరించడంలో మెప్పించారని చెప్పొచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ లో లీడ్ నటీనటులు అదరగొట్టారు. ప్రియాంక చోప్రా, జాన్ సీనా, ఐడ్రిస్ ఎల్బాలు తమ పాత్రల్లో షైన్ అయ్యారు. అలాగే సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ ఇంకా ఫన్ వంటివి ఈ తరహా యాక్షన్ సినిమాలుని ఇష్టపడేవారిని ఎంగేజ్ చేస్తాయి. కాకపోతే ఇలాంటి స్టార్స్ తో ఒక కొత్త కథని కోరుకునేవారు మాత్రం డిజప్పాయింట్ కావచ్చు. కానీ కథ ఎలా ఉన్నా ఎంజాయ్ చెయ్యాలి అనుకునేవారికి ఈ సినిమా మీకోసమే ట్రై చెయ్యండి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు