మరో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన బన్నీ

అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి మరుపురాని విజయాన్ని అందుకున్నారు. అల వైకుంఠపురంలో మూవీతో ఆయన ఓ భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ అందుకుంది. ఈ చిత్ర విజయంలో థమన్ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఆల్ టైమ్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ తన పాటలతో ఓ ఊపు ఊపారు. ఇక యూట్యూబ్ లో ఈ మూవీ సాంగ్స్ వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకొని సత్తా చాటాయి

ముఖ్యంగా బుట్ట బొమ్మా సాంగ్ విశేష ప్రేక్షాదరణ దక్కించుకుంది. కాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. ఏకంగా 300 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. అత్యంత త్వరగా 300 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న తెలుగు పాటగా బుట్ట బొమ్మ సాంగ్ రికార్డులకు ఎక్కింది. ఈ సాంగ్ అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడారు. మరి భవిష్యత్తులో ఈ సాంగ్ మరిన్ని రికార్డ్స్ నెలకొల్పనుందో చూడాలి.

Exit mobile version