ఫిబ్రవరిలో బిజీ బిజీగా మారనున్న టాలీవుడ్

ఫిబ్రవరిలో బిజీ బిజీగా మారనున్న టాలీవుడ్

Published on Dec 4, 2013 8:10 AM IST

Tollywood
మాములుగా చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫిబ్రవరి అనేది అంత కలిసొచ్చే మాసం కాదు. అలాగే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆ నెలలో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఉన్నట్టుండి ఫిబ్రవరి ఒక్కసారిగా సినిమాల రిలీజ్ కి హాట్ స్పాట్ గా మారిపోయింది. ఈ సంవత్సరం యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ నటించిన మిర్చి సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

2014లో కూడా ఫిబ్రవరి నెల బాగా బిజీ బిజీగా మారనుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’, కమల్ హాసన్ నటిస్తున్న ‘విశ్వరూపం 2’, అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేస్ గుర్రం’, నయనతార నటిస్తున్న ‘అనామిక’, సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సినిమాలు ఫిబ్రవరిలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నాయి. పెరిగిన మల్టీ ప్లెక్స్ లు, అలాగే సినిమాలు ఇష్టపడే యూత్ ని చూసి సినిమా డిస్ట్రిబ్యూషన్, తెలుగు సినిమాల రిలీజ్ ప్లానింగ్స్ మారుతున్నాయి.

తాజా వార్తలు