ఈ రోజే బిజినెస్ మేన్ సక్సెస్ మీట్

ఈ రోజే బిజినెస్ మేన్ సక్సెస్ మీట్

Published on Jan 23, 2012 12:36 PM IST


బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొల్లగొడుతున్న ‘బిజినెస్ మేన్’ చిత్ర సక్సెస్ మీట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో జరగనుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు మరియు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే ఈ చిత్ర యూనిట్ సభ్యులు కూడా వేడుకకు హాజరు కాబోతున్నారు. మహేష్ బాబు ‘దూకుడు’ చిత్ర సక్సెస్ మీట్ కూడా ఇక్కడే జరగడం విశేషం. బిజినెస్ మేన్ చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలవబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు