తమిళ చిత్రంలో నటిస్తున్న బస్ స్టాప్ హీరోయిన్

తమిళ చిత్రంలో నటిస్తున్న బస్ స్టాప్ హీరోయిన్

Published on Jul 15, 2013 11:00 PM IST

Sree-Divya
మారుతి తీసిన ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన శ్రీ దివ్యకు తమిళ్ లో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. స్వాతి, బిందు మాధవి వంటి నటులు ఇప్పటికే తమిళ చిత్ర సీమలో తమతమ అదృష్టాలను పరిక్షించుకొగా ఇప్పుడు ఆ జాబితాలోకి శ్రీ దివ్య కూడా చేరింది. ‘వారుత పడతా వలిబర్ సంఘం’ అనే తమిళ చిత్రంలో శివ కార్తికేయన్ కు జంటగా నటిస్తుంది. ఈ సినిమాలో బిందు మాధవి మరియు సత్యరాజ్ ముఖ్యపాత్రాలను పోషిస్తున్నారు. పోర్ణం చిత్ర దర్శకుడు. డి. ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ మధ్యే స్టార్ స్థాయికి ఎదుగుతున్న శివకార్తిక్ వల్ల సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ దివ్య ఇప్పటికే రామరాజు తీసిన ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది. సాధారణ గృహిణి తన అభిమాన రచయితతో ప్రేమలో పడే పాత్రలో తను నటించింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు