స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘జులాయి’ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరొయిన్ గా నటిస్తుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పోలిస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తుండగా డివివి దానయ్య సమర్పిస్తున్నాడు. డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి.