చివరి దశకు చేరుకున్న జులాయి డబ్బింగ్

చివరి దశకు చేరుకున్న జులాయి డబ్బింగ్

Published on Jul 3, 2012 11:02 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రానికి సంభందించిన డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రోజు లేదా రేపటిలోగా బన్నీ చెప్పే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని జూలై 13న విడుదలకు సిద్దమవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మొదటిసారి నటిస్తున్నారు మరియు ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా మొదటి సారిగా బన్నీ సరసన నటించారు.

ఈ చిత్రాన్ని దొంగతనం మరియు దోపిడీలు ప్రధానంశంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పోలిస్ పాత్రలో కనిపించనున్నారు మరియు సోనూ సూద్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు.

తాజా వార్తలు