వచ్చే వారం నుంచి ఎవడు సెట్లో సందడి చేయనున్న బన్ని

వచ్చే వారం నుంచి ఎవడు సెట్లో సందడి చేయనున్న బన్ని

Published on Apr 2, 2013 3:45 AM IST

allu-arjun1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి రాగానే ఏప్రిల్ 5 నుంచి గానీ లేదా ఆ తర్వాత గానీ ‘ఎవడు’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు, అల్లు అర్జున్ కి జంటగా కాజల్ అగర్వాల్ కూడా అతిధి పాత్రలో కనిపించనుంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. మర్డర్ మిస్టరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది, సెకండ్ హీరోయిన్ గా అమీ జాక్సన్ కనిపించనుంది. ఇప్పటికే ఎక్కువభాగం షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ లో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు