పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ మే రెండవ వారంలో విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తుంది. ఈ చిత్ర ఉత్తరాంధ్ర హక్కులు 3 కోట్ల 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసారు. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ ఉండటం ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫోటోలు మరియు టీజర్ చూసాక అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ఏప్రిల్ 10న ఒక పాట చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనుంది. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరుడిగా అజయ్ కనిపించబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ బాబు నిర్మాత.