యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బాద్షా’. ఈ చిత్రానికి సంభందించిన శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కి 7.25 కోట్ల రేటు పలుకుతోంది, తొందర్లోనే ఈ రైట్స్ విషయం ముగింపుకు రానుంది. ఈ చిత్ర రైట్స్ కోసం రెండు ప్రముఖ టీవీ చానళ్ళు పోటీ పడుతున్నాయి. కామెడీని అద్భుతంగా పండించగల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్ సరికొత్త లుక్ తో కనిపించనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం యూరప్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘బృందావనం’ తర్వాత కాజల్ అగర్వాల్ రెండవ సారి ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ సరసన నటిస్తోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.