తమిళంలో బృందావనం


ఎన్టీయార్, కాజల్ మరియు సమంతలు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “బృందావనం” ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ చెయ్యబోతున్నారు. రాజకీయ వేత్తగా మారిన నటుడు విజయ్ కాంత్ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేశారు. ఈ చిత్రంతో విజయ్ కాంత్ కొడుకు షణ్ముగ పాండియన్ పరిచయమవనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి విజయ్ కాంత్ ప్రముఖ దర్శకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సమంత మరియు కాజల్ పాత్రలను ఎవరు పోషిస్తున్నారనేది ఆసక్తి కరమయిన విషయం. ఇదిలా ఉండగా షణ్ముగ పాండియన్ జిమ్ కి వెళ్లి కసరత్తులు మొదలు పెట్టారు. దీనితో పాటు డాన్స్ మరియు ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు. తెలుగులో ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2010లో మంచి విజయం సాదించిన చిత్రం.

Exit mobile version