బ్రేకింగ్ : ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

బ్రేకింగ్ : ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 5, 2020 4:22 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా తాజాగా చిత్రబృందం నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. మేకర్స్ ట్వీట్ చేస్తూ.. ‘అప్ డేట్స్ కోసం మమ్మల్ని తిట్టడంలో మీ అసమానమైన సృజనాత్మకత అలాగే మన ఫెస్టివల్ ఎప్పుడు అంటూ పెట్టే పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని ఉత్తేజ పర్చినందుకు ధన్యవాదాలు. సమయం గడిచింది. చివరకు రివీల్ అయ్యే క్షణం వచ్చేసింది. ఇప్పుడు, మిమ్మల్ని అలరించడం మా వంతు. రేపటి కోసం వేచి ఉండండి’ అంటూ ‘ఆర్ఆర్ఆర్ పోస్ట్ చేసింది.

తారక్ ఫస్ట్ లుక్ వీడియో కోసం గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ట్వీట్ చేసింది తారక్ పై వీడియోకి సంబంధించే అని అనిపిస్తోంది. మరి చూడాలి, ఎలాంటి వీడియోని రిలీజ్ చేస్తారో. ‘ఏదో రిలీజ్ చేయాలి కదా అని ఏదొకటి రిలీజ్ చేయడం తమకు ఇష్టం లేదని, అద్భుతమైన అవుట్ ఫుట్ తోనే మీ ముందుకు వస్తామని ఆ మధ్య రాజమౌళి ఎన్టీఆర్ టీజర్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు