‘జెఫ్ఫా’ ఆగుస్టులో వస్తాడా?

‘జెఫ్ఫా’ ఆగుస్టులో వస్తాడా?

Published on Jul 19, 2012 8:08 AM IST


బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘జెఫ్ఫా’ ఆగుస్టులో రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారి తీసిన రెండవ చిత్రం జెఫ్ఫా. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తి పెంచింది. బ్రహ్మానందం ఇందులో జఫ్ఫార్ ఖాన్ అనే టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. రమేష్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా వెన్నెల ఒన్ అండ్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది.

తాజా వార్తలు