బ్రహ్మానందం జఫ్ఫా ఈ రోజే విడుదల

బ్రహ్మానందం జఫ్ఫా ఈ రోజే విడుదల

Published on Apr 2, 2013 4:35 AM IST

Jaffa-First-Look-Poster
కామెడీ స్టార్ బ్రహ్మానందం నటించిన ‘జఫ్ఫా’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కామెడీ యాక్టర్ వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ కామెడీ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ సినిమాకి మల్టీ ప్లెక్స్ క్రౌడ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్స్ వల్ల మూవీ పై కాస్త క్రేజ్ ఉంది. బ్రహ్మానందం ఒక్కడే సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించగలిగాడా లేదా అనేది చూడాలి..

తాజా వార్తలు