భాయ్ తో కలిసి కామెడీ చెయ్యనున్న ఎన్.ఆర్.ఐ ఎవరు??

భాయ్ తో కలిసి కామెడీ చెయ్యనున్న ఎన్.ఆర్.ఐ ఎవరు??

Published on Oct 7, 2013 9:00 PM IST

Brahmanandam-Gallery-(1)
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమాలో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఈ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్నా ఇందులో కడుపుబ్బా నవ్వించే కామెడీకి ఆస్కారం వుందంట. ఈ సినిమాలో బ్రాహ్మి ఎన్.ఆర్.ఐ గా కనిపించనున్నాడు. హాస్యసన్నివేశాలపై పట్టున్న వీరభద్రమ్ చౌదరి ఈ సినిమాకు దర్శకుడు

నాగార్జున సరసన రీచా గంగోపాధ్యాయ్ నటించింది. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సౌజన్యంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో త్వరలోనే విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్ ని సంపాదించుకుని ఇటీవలకాలంలో వచ్చిన నాగార్జున సినిమాలలో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాగా మారింది

తాజా వార్తలు