డబ్బింగ్ జరుపుకుంటున్న దేవుడు చేసిన మనుషులు

డబ్బింగ్ జరుపుకుంటున్న దేవుడు చేసిన మనుషులు

Published on May 26, 2012 10:43 PM IST


రవితేజ మరియు ఇలియానా ఇద్దరు ఆశలు పెట్టుకున్న ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ పూర్తి చేసుకుని పాటలో చిత్రీకరణలో బిజీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి. బ్రహ్మానందం మరియు సుబ్బరాజు మరికొందరు నటులు ఈ చిత్రం కోసం డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. ప్రస్తుతం రవితేజ, ఇలియానా ఇటలీలో ఈ చిత్రానికి సంభందించిన పాటల చిత్రీకరణ చేస్తున్నారు. గతంలో ‘ఎందుకే రమణమ్మ’ అంటూ పాట కంపోజ్ చేసి సంచలనం సృష్టించిన రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూన్ మొదటి ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు