సినిమాలు చూడనంటున్న బ్రహ్మానందం

Brahmanandam
బ్రహ్మానందం ఆంద్రప్రదేశ్ లో ఒక గొప్ప హాస్యనటుడు. ఈయనకి కొంతమంది స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఈ హాస్య నటుడు 1000 సినిమాలకు దగ్గరవుతున్న తరుణంలో ఈయన సినిమాలు చూడడని తెలిస్తే షాక్ అవుతారు. అవును మీరు విన్నది నిజమే బ్రహ్మానందం సినిమాలను చూడరు. బ్రహ్మానందం ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఓ ప్రముఖ తెలుగు ఫిల్మ్ మాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘ నేను సినిమాలు చూడను’ అని చెప్పాడు. అలాగే నాకు మంచి పేరును తెచ్చిన ‘దూకుడు’ సినిమాను కూడా చూడలేదని. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పారు.

బ్రహ్మానందం నేను సినిమాలలోకి అనుకోకుండా వచ్చానని అన్నాడు. ‘నేను ఒక తెలుగు లెక్చరర్ ని, నాకు మిమిక్రీ కూడా తెలుసు. ఈ విషయాన్ని జంద్యాల గారు గుర్తించి నాకు ‘అహ నా పెళ్ళంట’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే డా.రామానాయుడు గారు మరియు తెలుగు ప్రేక్షకులు నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు’ అని అన్నాడు.

Exit mobile version