ఫేక్ రేటింగ్ ఛానెల్స్ కు గట్టి షాకే ఇచ్చారే.!

ఫేక్ రేటింగ్ ఛానెల్స్ కు గట్టి షాకే ఇచ్చారే.!

Published on Oct 15, 2020 3:00 PM IST

ఈ ఏడాది లాక్ డౌన్ దెబ్బతో సినీ రంగం ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో స్మాల్ స్క్రీన్ రంగం ఒక్కసారిగా పైకి లేచింది. ఎన్నడూ లేని విధంగా మొత్తం దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యూవర్ షిప్ లాక్ డౌన్ విధించిన మొదటి రెండు మూడు నెలలలో నమోదు అయ్యినట్టుగా బి ఏ ఆర్ సి(బ్రాడ్ క్యాస్ట్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) వారు తెలిపారు.

అయితే ఈ సమయంలోనే వార్తా ఛానెల్స్ కు ఒక్కసారిగా మరింత ఆదరణ పెరిగింది. దీనితో న్యూస్ ఛానెల్స్ లో తీవ్ర పోటీ నెలకొనడంతో మా ఛానెల్ నెంబర్ 1 అంటే మాది నెంబర్ 1 అని పలు ఛానెల్స్ రేటింగ్స్ గేమ్ ఆడాయి. ఇదంతా ఆ మధ్య పెద్ద రచ్చనే లేపింది.

దీనితో ఈ నంబర్స్ గేమ్ కు రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్ క్యాస్ట్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా వారు గట్టి షాక్ నే ఇచ్చారు. ఇప్పటి నుంచి మూడు నెలల పాటు ఏ ఛానెల్ వారాంతపు రేటింగ్స్ ఇవ్వబోవడం జరగదని తేల్చి చెప్పేసారు. మరి ఇందులో మన తెలుగు ఛానెల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో లేదో అన్నది సరైన క్లారిటీ లేదు.

తాజా వార్తలు