దారిమార్చనున్న బోయపాటి శ్రీను?

Boyapati-Sreenu11
దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ మసాలా సినిమాలకు ప్రసిద్ధి. ఆయన సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ లను, భీభత్సమైన రౌద్ర రసాన్ని ఆశించవచ్చు. అదే కోవలో ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’గా మరోసారి విజయం సాధించారు. కానీ బోయపాటి ఇక ఆ ఇమేజ్ నుండి బయటకు రావాలని అనుకుంటున్నాడు

తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తో తీయనున్న తన తదుపరి సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీయాలని భావిస్తున్నాడట. ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్ లకు అధిక ప్రాధాన్యం వుండనుంది అని అంటున్నారు

ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు

Exit mobile version