బోయపాటి శ్రీను డైరెక్షన్ లోరామ్ చరణ్

boyapati-srinu-ram-charan
డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసిన ‘లెజెండ్’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చాలా ఆనందంగా ఉన్నాడు. వరుసగా నందమూరి బాలకృష్ణతో చేసిన రెండు సినిమాలో సక్సెస్ అయ్యాయి. గతంలో బాలకృష్ణతో బి గోపాల్ ఇదే రీతిలో వరుస హిట్స్ అందుకున్నారు.

బోయపాటి శ్రీను ప్రస్తుతం తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. అది కూడా రామ్ చరణ్ తో ఉంటుందని ఖరారు చేసాడు. ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మిస్తారని కూడా తెలిపారు.

‘ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్కి కథ వినిపించాను. వారికి నచ్చింది. ఇక పూర్తి కథని సిద్దం చేయాలి. దానికి నాలుగైదు నెలలు సమయం పడుతుందని’ బోయపాటి శ్రీను అన్నాడు.

Exit mobile version