నేటి బాక్స్ ఆఫ్ఫిస్ విజేత ఎవరు?

నేటి బాక్స్ ఆఫ్ఫిస్ విజేత ఎవరు?

Published on Aug 23, 2013 8:56 AM IST

telugu-movies
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఆందోళనల దృష్ట్యా బడా హీరోల సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. దాంతో చాలా కాలంగా ఆగిపోయి ఉన్న చిన్న సినిమాలు గత రెండు వారాలుగా బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. గత వారం లానే ఈ వారం కూడా 5 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

అందులో మొదటిది సుమంత్ అశ్విన్ – ఇషా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అంతకు ముందు ఆ తరువాత’. మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దామోదర ప్రసాద్ నిర్మించాడు. ఇక రెండవది.. వెన్నెల కిషోర్ – ప్రియాంక చాబ్రా జంటగా నటించిన ‘అతడు ఆమె ఓ స్కూటర్’. ఈ కామెడీ ఎంటర్టైనర్ కి లక్ష్మణ్ గంగారావు దర్శకుడు.

మూడవ చిత్రానికి వస్తే ఈ మధ్య కాలంలో యువతని మాత్రమె టార్గెట్ చేస్తున్న సినిమాల తరహాలోనే తీసిన ‘తెలిసి తెలియక’. కొత్త నటీనటులు నటించిన ఈ మూవీకి జయప్రకాశ్ దర్శకుడు. నాలుగవ చిత్రంగా ‘ఎలా చెప్పను’ అనే మరో ప్రేమకథ చిత్రం విడుదలవుతోంది. చివరిగా సనాఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గజ్జెల గుర్రం’ అనే డబ్బింగ్ మూవీ విడుదల కానుంది. ఇది మలయాళంలో వచ్చిన ‘క్లైమాక్స్’ సినిమాకి రీమేక్.

ఇలా ఈ రోజు బాక్స్ ఆఫీసు వద్ద 5 సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో నేటి బాక్స్ ఆఫీసు విజేతగా నిలిచేది ఎవరో? చూడాలి.

తాజా వార్తలు