టాలీవుడ్ వేడుకకి బాలీవుడ్ దిగ్గజాలు

టాలీవుడ్ వేడుకకి బాలీవుడ్ దిగ్గజాలు

Published on Jul 15, 2013 2:29 PM IST

srk-big-b
మన భారత దేశంలో ఒక తెరపై కదిలే బొమ్మలను చూపించడం మొదలు పెట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వంద సంవత్సరాలలో ఇండియా లోని పలు భాషల్లో ఎన్నో వేల సినిమాలు రాకుండా వాటిలోని కొన్ని సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును కూడా తెచ్చాయి. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్, ఏ.పి. ఫిల్మ్ ఛాంబర్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్, కేరళ ఫిల్మ్ ఛాంబర్‌లు అన్నీ ఒక్క తాటి పై కలిసి రానున్న సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో మొత్తం మూడు రోజులు చెన్నైలో పెద్ద ఎత్తున సినిమా పండుగ నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు వచ్చే ముఖ్య అతిధుల లిస్టులో తాజాగా బాలీవుడ్ దిగ్గజాలు అయిన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లు కూడా చేరారు. ఈ విషయాన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్ తెలిపాడు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సౌత్ లోని నాలుగు రాష్ట్రాలకు చెందినా ముఖ్య మంత్రులు కూడా హాజరు కానుండడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు