తమన్నాపై కేసు పెట్టిన బాలీవుడ్ నిర్మాత

తమన్నాపై కేసు పెట్టిన బాలీవుడ్ నిర్మాత

Published on Nov 6, 2012 1:03 PM IST


మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నిర్మాత సలీం అక్తర్ వల్ల ఒక లీగల్ వివాదంలో ఇరుక్కుంది. సలీం అక్తర్ నిర్మించిన ఫీచర్ ఫిల్మ్ ‘ చాంద్ స రోషన్ చెహ్రా’ అనే సినిమా ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్ర నిర్మాత ఇప్పుడు తమన్నాపై కేసు పెట్టారు. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చేటప్పుడు సలీం తమన్నా 2005 నుండి 2010 వరకూ నటించే సినిమాల్లో తనకి వచ్చే పారితోషికంలో 25% ఇవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

2005లో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత తమన్నా తెలుగులో మంచు మనోజ్ సరసన ‘శ్రీ’ సినిమాలో నటించారు. ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయారు. తనకు అనుకున్న ఒప్పందం ప్రకారం మూల్యం చెల్లించలేదని కోల్ కతా హై కోర్టులో సలీం కేసు నమోదు చేసారు.

ఈ విషయం పై తమన్నా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోగా, తమన్నా నాన్నగారు మాత్రం ఇవన్నీ సలీం అక్తర్ చేస్తున్న పనికిమాలిన ఆరోపణలు అని ఆయన అన్నారు.

తాజా వార్తలు