సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరు. ట్రెండ్ మార్చి కొత్తగా తీసిన “డిస్కో రాజా” బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. దీనితో ఒక మంచి హిట్ కొట్టాలని తన తర్వాత ప్రాజెక్టులను మరింత జాగ్రత్తగా ఎన్నుకొంటున్నారు. అలా ప్రస్తుతం తన హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో “క్రాక్” అనే సినిమా తీస్తున్నారు.
అలాగే దీని తర్వాత దర్శకుడు రమేష్ వర్మతో కూడా ఒక చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే కాస్త లేట్ గా మొదలయినా ఈ సినిమా విషయంలో రవితేజ కాస్త క్లారిటీగానే ఉన్నారట. అందులో భాగంగానే ఈ చిత్రానికి ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.