‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ సినిమాలో నటించిన అరవింద్ కృష్ణ చాలాకాలం విరామం తీసుకున్నాడు. అయితే సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ వచ్చిన అతని చేతిలో ఇప్పుడు దాదాపు 5 సినిమాలు వున్నాయి. అందులో ఒక సినిమానే ‘బిస్కెట్’. ఈ చిత్రం చిత్రీకరణ ముగించుకుని అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతుంది. త్వరలో ఆడియోను మార్కెట్లోకి విడుదల చేస్తారు
తన మాటలతో అందరినీ కట్టిపడేసే హీరో ఆఖరికి ఎలాంటి సంఘటనలను ఎదురుకున్నాడు అనే కధను కామెడీ ప్రధానంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
అరవింద్ కృష్ణ కు జంటగా డింపిల్ నటించింది. అనీల్ గోపి రెడ్డి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. స్రవంతి మరియు రాజ్ నిర్మాతలు. ఈ సినిమాతో అయినా అరవింద్ కు బ్రేక్ లభిస్తుందేమో చూడాలి