తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటి సావిత్రి గారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరాభిమానాల్ని మరియు అంతటి గౌరవాన్ని గెలుచుకున్న తార సౌందర్య. అలాంటి నటి ఇప్పుడు మన మధ్య లేరు అని చెప్పుకోవడం బాధాకరమైన విషయం, ఇప్పుడు ఆమె బతికుంటే ఈ రోజు ఆమె తన 40వ పుట్టిన రోజు వేడుకని జరుపుకునేవారు. తన ఫ్యామిలీతో పాటు ఉన్న చిన్ననాటి సౌందర్యని పై ఫోటోలో మీరు చూడవచ్చు.
1972 జూలై 18న జన్మించిన సౌందర్య, 2004 ఏప్రిల్ 17న ఒక విమాన ప్రమాదంలో చనిపోయేంత వరకు తెలుగు చలన చిత్ర రంగంలో అగ్ర తారగా మరియు నటిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. సౌందర్య జన్మదిన సందర్భంగా ఆ మహానటిని ఒకసారి మనస్పూర్తిగా స్మరించుకుందాం.