ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా కొత్త మూవీ

ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా కొత్త మూవీ

Published on Apr 7, 2014 9:00 AM IST

NTR-and-Puri
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గత కొద్ది రోజుల క్రితం వరకూ ‘రభస’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ దాదాపు ఒక నెల రోజులుగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కి ఆరోగ్యం బాగా లేనందు వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. నేటి నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

ఇది కాకుండా ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై కూడా దృష్టి సారించాడు. ఇప్పటికే పూరి జగన్నాధ్ చెప్పిన లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కథని సిద్దం చేసే పనిలో పూరి జగన్నాధ్ బ్యాంకాక్లో బిజీగా ఉన్నాడు.

ఎన్.టి.ఆర్ ‘రభస’ తర్వాత నటించబోయే కొత్త సినిమా విశేషాలను తన పుట్టిన రోజు సందర్భంగా అనగా మే 20న అనౌన్స్ చేయనున్నారు. అలాగే అదే నెలలో ‘రభస’ సినిమాని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ‘రభస’ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు