ప్రీక్వెల్ తీయాలనేది నా ఐడియా కాదు : చక్రి తోలేటి


బిల్లాకి ప్రీక్వెల్ గా రూపొందిన బిల్లా 2 తెలుగులో డేవిడ్ బిల్లా పేరుతో అనువాదమై గత శుక్రవారం విడుదలైన విషయం తెల్సిందే. తెలుగులో ఎస్.వి.ఆర్ మీడియా పై లిమిటెడ్ సంస్థ ఈ సినిమాని విడుదల చేసింది. చిత్ర దర్శకుడు చక్రి తోలేటి ఈ రోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ “డేవిడ్ బిల్లా సినిమాకి తను దర్శకుడిగా ఎంపిక కాకముందే ప్రీక్వెల్ చేయాలన్న నిర్ణయం జరిగిపోయింది. హిందూజా గ్రూప సంస్థ వారు ఈ సినిమాని ప్రీక్వెల్ గా నిర్మించాలని నిర్ణయించి నన్ను దర్శకుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సినిమాని మొదట హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభించాం. ఆ తరువాత వైజాగ్లో కొంత భాగం చిత్రీకరించడం జరిగింది. మొత్తం 110 రోజులు షూటింగ్ చేసాము. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి బిల్లా చూడలేదు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టైల్లో ఉన్న మాట వాస్తవమే. టెక్నాలజీ పరంగా అంతా లేటెస్ట్ టెక్నాలజీ వాడాము. ఈ సినిమా క్లైమాక్స్ అంతా జార్జియా దేశంలో షూట్ చేసాము. క్లైమాక్స్ ఫైట్లో ఒరిజినల్ గన్స్ వాడటం జరిగింది. జార్జియా దేశం వారు షూటింగ్ సమయంలో బాగా సహకరించారని” ఆయన తెలిపారు.

Exit mobile version