అలియాస్ జానకి సినిమాలో నటించిన రాహుల్ త్వరలో బిల్లా రంగా సినిమాతో మనముందుకు రానున్నాడు. ప్రదీప్ మాడుగుల ఈ సినిమాకు దర్శకుడు. ప్రదీప్, రిక్షిక మరియు చరణ్ దీప్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. వంశీ కృష్ణ బోయిన, అరవింద్ కుమార్ వన్నాల, సుధీర్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఒక పల్లెటూరు ప్రాంతంలో బిల్లా మరియు రంగా అనే ఇద్దరు వ్యక్తుల కధే ఈ సినిమా. మా సినిమాలో వైజాగ్ సత్యానంద్ పాత్ర చాలా ప్రత్యేకం” అని తెలిపారు
సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. విశ్వేశ్వర్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం ఆడియో విడుదలై చాలా కాలం కావస్తున్నా కొన్ని కారణాల వలన విడుదలకు జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈ నెల 21న ఈ సినిమా మనముందుకు రానుంది