తెలుగులో సినిమా చేయడానికి మంచి కథ కావాలంటున్న దర్శకుడు


తెలుగు వాడు అయినప్పటికీ మొదటి రెండు సినిమాలు తమిళ్లోనే తీసిన దర్శకుడు చక్రి తోలేటి. ఈనాడు సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడితో పని చేసిన చక్రి రెండవ సినిమాకి అజిత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన బిల్లా 2 తెలుగులో డేవిడ్ బిల్లాగా విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చక్రి మాట్లాడుతూ “సరైన కథ దొరికితే తెలుగులో స్ట్రైట్ సినిమా తప్పకుండ చేస్తాను. ఇప్పటి వరకు ఇంకా ఏ సినిమా కమిట్ కాలేదు. డేవిడ్ బిల్లాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది” అన్నారు. కమల్ హాసన్ నటించిన సాగర సంగమం సినిమాలో చక్రి తోలేటి చిన్న పాత్ర పోషించారు.

Exit mobile version