ఎన్టీఆర్ హీరోయిన్‌కు అగ్నిపరీక్ష

NTRNell

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కెరీర్ ఇప్పుడే జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ‘సప్తసాగరాలు దాటి’తో ఒక్కసారిగా నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి, స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వచ్చి పడడం విశేషం. సక్సెస్ కంటే ఎక్కువగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, చార్మింగ్ లుక్స్‌నే ఫిలిం మేకర్స్ నమ్ముతున్నారనేది క్లియర్ అవుతోంది.

ఇప్పటికే రుక్మిణి చేతిలో పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘కాంతార 1’లో కీలక పాత్ర, ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’, యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ వంటి సినిమాలు ఆమె లైనప్‌లో ఉండటం గ్లామర్ తో పాటు క్రేజ్ కూడా పెంచేసింది. కానీ ఈ క్రేజీ ఆఫర్స్ కంటే ముందు రుక్మిణి లైమ్‌లైట్‌లోకి తెచ్చేది మదరాసి.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందో లేదో అనేది మాత్రమే కాకుండా, రుక్మిణి కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే ఆసక్తి కూడా పెరిగింది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రుక్మిణి ఆకర్షణీయమైన లుక్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. మదరాసి హిట్ అయితే రుక్మిణి వసంత్ ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఏర్పడదు.

Exit mobile version