చందమామ కధలు చిత్రానికి అదనపు ఆకర్షణ

chandamama-kathalu
‘చందమామ కధలు’ సినిమాకు ఈరోజు మంచి కిక్ ఇచ్చే విషయంతోడయ్యింది. ఈ సినిమా నిర్మాణ బృందంలో అనీల్ సుంకర చేరారు. సినిమాలో భాగస్వామిగా మారి పంపిణీ హక్కులను, రిలీజ్ ని దగ్గరుండి చూసుకుంటాడట

లెజెండ్ సినిమా విజయంతో అనీల్ సుంకర ఆనందంలో వున్నాడు. ఈ సినిమాకు అతను సహనిర్మాత. ఈ సినిమాలో చైతన్య కృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, అభిజీత్, షామిలి, ఇషా, కిషోర్ మరియు రిచా పనై ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతదర్శకుడు.

వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను చాణుక్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నాడు

Exit mobile version