‘అత్త్తరింటికి దారేది’ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ సక్సెస్ అందుకోవడంతో తెలుగు సినిమా హీరోలు కుటుంబకథా చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ హీరోలైన ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ప్రస్తుతం ఫ్యామిలీ డ్రామా సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వచ్చే సంవత్సరంలో ఓ భారీ బడ్జెట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఈ ముగ్గురు హీరోలని దిల్ రాజు కలిసాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే టైటిల్ అనుకుంటున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా గురించి 2014 మొదట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది