విశ్వంభర కోసం వస్తున్న భీమ్స్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట మల్లిడి డైరెక్ట్ చేస్తుండగా యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ సాంగ్‌ను షూట్ చేయాల్సి ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో చిరంజీవి గత సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారని.. ‘అన్నయ్య’ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిన ‘ఆట కావాలా పాట కావాలా’ అనే పాటను సరికొత్తగా రీమిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పాటను కంపోజ్ చేసే బాధ్యత భీమ్స్ సిసిరోలియోకు అప్పగించారని తెలుస్తోంది. దీంతో ఈ పాటను ఆయన కంపోజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ పాటలో చిరు సరసన బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతుందని చిత్ర వర్గాల టాక్. ఈ సినిమాను పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా మేకర్స్ రూపొందిస్తుండగా ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version