మళ్ళీ వాయిదా పడిన ‘భీమవరం బుల్లోడు’

Sunil-In-Bheemavaram-Bullod

కామెడీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర విభజన సమస్య వల్ల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సినిమాని వాయిదా వేసారు.

సునీల్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కుర్రాడి పాత్రలో కనిపించనున్న సునీల్ ఈ సినిమాలో భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి విలన్స్ పని పట్టే పాత్రలో కనిపించనున్నాడు. ఉదయ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించాడు. ఎస్తర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల వల్ల పలు సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Exit mobile version