కామెడీ హీరో సునీల్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘భీమవరం బుల్లోడు’. సంక్రాంతి నుంచి విడుదల చెయ్యాలని అనుకుంటున్నా ఈ సినిమా పలు సమస్యల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఫిబ్రవరి 14 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఉదయ శంకర్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాని అనూప్ సంగీతం అందించాడు. ఆలస్యమవుతున్నా సినిమా మాత్రం కచ్చితంగా హిట్ అవుతుందని సునీల్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మరోవైపు ఫిబ్రవరి 27న మరో మూడు తెలుగు సినిమాలు కూడా విడుదలవుతుండడం వల్ల ఆ రోజన్నా విడుదలవుతుందా లేదా అనే అనుమానాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.