పతాక సన్నివేశాల్లో ఒంగోలు గిత్త


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఒంగోలు గిత్త’. ఈ రోజు నుండి ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.’ ఈ రోజు నుంచి క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేస్తున్నాము. ఈ రోజు రాత్రి కూడా కంటిన్యూ గా షూట్ చేయనున్నాం. కొత్తగా ప్లాన్ చేస్తున్న క్లైమాక్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని’ రామ్ ట్వీట్ చేసారు. కృతి కర్బంద హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఈ నెల చివరిలోగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బి.వి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని భాస్కర్ తన గత సినిమాల షూటింగ్ కన్నా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు.

Exit mobile version