జీ5 ఓటీటీలో ‘భైరవం’ సాలిడ్ ఫీట్.. గ్లోబల్‌గా నెంబర్ 1

జీ5 ఓటీటీలో ‘భైరవం’ సాలిడ్ ఫీట్.. గ్లోబల్‌గా నెంబర్ 1

Published on Jul 21, 2025 9:30 PM IST

Bhairavam

టాలీవుడ్‌లో తెరకెక్కిన రీసెంట్ మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేయగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో వచ్చిందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత రీసెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ చిత్రం తాజాగా ఓ సాలిడ్ ఫీట్ క్రియేట్ చేసింది. గ్లోబల్‌గా నెంబర్ 1 స్థానంలో ఈ చిత్రం జీ5లో ట్రెండింగ్ అవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలోని యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుందని వారు అంటున్నారు.

ఇలా ఓటీటీలో భైరవం మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు