24న భాయ్ ట్రిపిల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక

24న భాయ్ ట్రిపిల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక

Published on Oct 22, 2013 8:15 PM IST

Bhai
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా ట్రిపిల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్స్ లో 24 నా నిర్వహించనున్నారు. ఈ సినిమాకు మంచి ఆడియోను అందించిన దేవి శ్రీ ప్రసాద్ కు అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వీరభధ్రం సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు. ‘భాయ్’ ఈ నెల 24 న మనముందుకు రానుంది. రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. బ్రహ్మానందం మరియు ఎం.ఎస్ నారాయణ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు

నాగార్జున ఈ మాస్ ఎంటెర్టైనర్ ను రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సౌజన్యంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు