కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమాలో ఆఖరి పాటను ఈ నెల 27 నుండి చిత్రీకరించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఆగష్టు మొదటివారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
‘భాయ్’ సినిమా పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని దర్శకుడు తెలిపాడు. నాగార్జున ఈ సినిమాలో స్టైలిష్ లూక్స్ తో ఎంటర్టైన్ చెయ్యనున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. ప్రేక్షకులు దర్శకుడి నుంచి మరో పూర్తిస్థాయి కామెడి సినిమాను ఆశిస్తున్నారు.
రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో సంయుక్తంగా నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రిచా గంగోపాధ్యాయ ఈ సినిమాలో హీరోయిన్