ఈ శుక్రవారం నాగార్జున ‘భాయ్’ ఫస్ట్ లుక్

ఈ శుక్రవారం నాగార్జున ‘భాయ్’ ఫస్ట్ లుక్

Published on Aug 6, 2013 3:38 PM IST

Bhai

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 9 శుక్రవారం రోజున విడుదలకానుంది. ఈ విషయన్ని ఈ సినిమా డైరెక్టర్ వీరభద్రం ఈ రోజు తెలియజేశాడు. ‘భాయ్’ సినిమా సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల తరువాత నాగార్జున ఈ సినిమాలో ఫుల్ మాస్ గా కనిపించనున్నాడు. రిచా గంగోపాద్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్, కామెడీ, చెల్లెలి సెంటిమెంట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’ లో నటించిన జరషా ఈ సినిమాలో నాగార్జున చెల్లెలిగా నటిస్తోంది.

తాజా వార్తలు